కడప , ప్రతినిధి : కోర్టు నుంచి తిరిగి వస్తూ కడప జిల్లా సెంట్రల్ జైలు నుంచి విచారణ ఖైదీ సునీల్ పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.. కడప సెంట్రల్ జైలకు చెందిన విచారణ ఖైదీ సునీల్ ను పోలీసులు విచారణ నిమిత్తం అనంతరపురం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం అతనిని కడప సెంట్రల్ జైలకు తరలించే క్రమంలో సునీల్ ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి పారిపోయాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సునీల్ పై కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్, హత్య కేసులు నమోదైఉన్నాయి.