మంబై, ప్రతినిధి : ముంబై పేలుళ్లలో ప్రధాన నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు అయింది. రూ. రెండు లక్షల పూచీకత్తుపై ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ ఇచ్చింది. లఖ్వీపై చాలా కేసులు ఉన్నాయి. అయితే, ఆ కేసుల్లో ఒకదానికి ఇప్పుడు ఇస్లామాబాద్ బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఇప్పుడు వచ్చిన బెయిల్ తో లఖ్వీ బయటికి వస్తాడో … రాడో… ఇంకా తెలియరాలేదు.
కొన్ని రోజుల క్రితం కూడా లఖ్వీకి పాక్ లోని హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తీర్పును అక్కడి సుప్రీంకోర్టు కొట్టేసి జైల్లోనే ఉండాలని ఆదేశించింది. పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన పాక్ సుప్రీంకోర్టు లఖ్వీ బెయిల్ ను కొట్టేసింది. 2009 నుంచి లఖ్వీ జైల్లోనే ఉంటున్నాడు.