ఏపీ రాజధానికి రైతుల భూ సమీకరణ వివాదాస్పదంగా మారింది. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, ఇవ్వక పోతే కొట్టేలా ఉన్నారని నాలుగు గ్రామాల్లోని పలువురు రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఫిర్యాదు చేశారు. రైతులందరూ స్వచ్ఛందంగా, ఆనందంగా భూముల పత్రాలను ఇస్తున్నారని మంత్రులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని వైసీపీ నేతలు చెప్తున్నారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటోందని, ఇది అన్యాయమని జగన్ ఆరోపిస్తున్నారు.
రైతుల గోడును నేరుగా గవర్నర్ కే వివరించడానికి చొరవ చూపారు జగన్. బలవంతంగా భూ సమీకరణ చేస్తున్న తీరును వైసీపీ నేతలు వివరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయాలని జగన్ నిర్ణయించారు. తుళ్లూరు చుట్టు పక్కల రైతులు ప్రభుత్వ బెదిరింపులతో భయభ్రాంతులు అవుతున్నారని, ఇటీవల పంటలను కాలబెట్టింది ఎవరనేది ఇంకా పోలీసులు తెలుసుకోలేక పోయారని వైసీపీ నేతలు చెప్పారు. పంటల దహనంతో రాజధాని ప్రాంత గ్రామల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొత్తానికి ప్రభుత్వం అనుకుంటున్న విధంగా చురుగ్గా భూసమీకరణ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజధాని రగడ
Leave a comment