ఓ తమిళ సినీ నటి తన భర్తనే హత్య చేసి అరెస్టయింది. శృతి చంద్రలేఖ అనే 22 ఏళ్ల తమిళ నటిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఆమెను బ్లూఫిలింలో నటించాలంటూ భర్త రోనాల్డ్ పీటర్ ఒత్తిడి చేయడంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.
మరో ఐదురురి సహాయంతో భర్తను హత్య చేసింది. అతడి మృత దేహాన్ని వారు తిరునల్వేలి జిల్లాలోఓ మారుమూల ప్రాంతంలో పూడ్చిపెట్టారు. అతడు కనిపించకుండా పోవడంతో సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రోనాల్డ్ పీటర్ కు డ్రయివర్ గా పనిచేసిన ప్రిన్సన్ ను ఇంటగారేట్ చేసినప్పుడు హత్య విషయం బయటకు వచ్చింది. దీంతో చంద్రలేఖను, మరో ఐదుగురిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంద్రలేఖ తన మొదటి భర్తతో విడిపోయి రోనాల్డ్ పీటర్ అనే వ్యాపారితో పరిచయం పెంచుకుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆన్ లైన్ కమడిటీస్ వ్యాపారం మొదలు పెట్టారు. దీని కోసం అతడు కొంత అప్పు చేశాడు. కానీ లాభాలు రాలేదు. అప్పు తీర్చాలనే ఒత్తిడి పెరగడంతో భార్యను బ్లూ ఫిలింలో నిటించాలని ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. పాలలో విషం కలిపి హత్య చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది