హైదరాబాద్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్ నుమా ప్యాలస్ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ధ్రువీకరించారు. అర్పిత వివాహం ఏడాది జనవరిలో జరగనుంది. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదని సలీమ్ ఖాన్ తెలిపారు. ‘మేము చాలా కూల్‌గా వివాహ వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. అందుకు ఫలక్‌నూమా ప్యాలెస్ ను వేదికగా ఎన్నుకున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్ రాలేదు. ఫలక్‌నూమా వండర్ఫుల్ వెన్యూ కావటంతో అందరం అంగీకరించాం’ అని సలీమ్ ఖాన్ పేర్కొన్నారు.