చెన్నై , ప్రతినిధి : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రెండువేల నాలుగు వందల థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయింది. అభిమానులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలయిన ఈ సినిమా చూడడానికి చెన్నైలో అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. కేకులు కట్ చేసి బాణాసంచా పేల్చారు. పాలాభిషేకాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేశారు. కేరింతలు కొడుతూ డాన్సులు చేశారు. తలైవా నీవే ప్రపంచంలో సూపర్‌స్టార్ అంటూ రజనీకి హ్యాపీ బర్త్ డే చెప్పారు. మరి లింగా సినిమా రోబోలా హిట్ అవుతుందా..? లేదా కొచ్చాడయన్ లా ఫట్ అవుతుందా చూడాలి.