ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఎలక్షన్స్ లో హంగ్ వస్తే తమ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. దీంతో, వెంటనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమెపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
‘ఎలక్షన్స్ ముందు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు?’ అని ఆమెను హైకమాండ్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, షీలా కామెంట్స్ ను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ లైట్ తీసుకున్నారు. ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఒప్పుకుందని వ్యంగ్యంగా స్పందించారు. దీంతో, కాంగ్రెస్-ఆప్ లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది.