ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు సోమవారం నాడు విడుదలైంది. ఫిబ్రవరి 7వ తేదీన ఎన్నికలు జరిపి, ఫిబ్రవరి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్.సంపత్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూలు…
నోటిఫికేషన్ తేదీ – 14 జనవరి
నామినేషన్ల దాఖలుకు తుది గడువు – 21 జనవరి
నామినేషన్ల పరిశీలన – 22 జనవరి
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు – 24 జనవరి
ఎన్నికలు – 7 ఫిబ్రవరి
కౌంటింగ్ – 10 ఫిబ్రవరి
ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిన తేదీ -12 ఫిబ్రవరి
ఢిల్లీలోని 70 నియోజవర్గాలలో 12 నియోజకవర్గా రిజర్వు నియోజకవర్గాలు. పోలింగ్ జరిగే అన్ని ఈవీఎంలలోను నోటా ఆప్షన్ వుంటుంది. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం అఫిడవిట్లో అన్ని కాలమ్‌లను అభ్యర్థులు పూర్తిచేయాలి. ఏ కాలమ్ అయినా ఖాళీగా వదిలేస్తే రిటర్నింగ్ అధికారులు నోటీసు ఆ కాలమ్ పూరించాలని కోరుతారు. అప్పటికీ అభ్యర్థులు స్పందించని పక్షంలో ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరిస్తారు. అన్ని రకాల పరిశీలకులను మోహరించి, ఎన్నికల వ్యయం, ఇతర ఘటనలపై నిఘా ఉంచాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు ఖరారు..
Leave a comment