లవ్ జీహాద్, ఘర్ వాపసీల్లో కొత్త ట్విస్ట్. బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ సైఫ్ ను పెళ్లి చేసుకుని బేగంగా మారింది. ఆమెను మళ్లీ హిందువుగా మారుస్తారట. ముస్లింలను పెళ్లాడిన వారందినీ తిరిగి హిందువులుగా ఘర్ వాపస్ తీసుకు రావాలని విశ్వహిందూ పరిషత్ అనుంబధ సంస్థ దుర్గా వాహిని నిర్ణయించింది. ఇప్పటికే 16 మంది ఇలాంటి యువతులు తాము హిందువులుగా మారుతామని సంప్రదించారని దుర్గా వాహిని తెలిపింది.
కరీనా కపూర్ సినిమా నటి, సెలబ్రిటీ కాబట్టి ఆమె మార్ఫింగ్ ఫొటోతో తమ ఉద్దేశాన్ని చాటింది. కరీనా ముఖం సగం హిందూ సగం ముస్లింగా ఉన్న ఫొటో ఇప్పుడు హిమాలయ ధ్వని మ్యాగజీన్ కవర్ పేజీగా హల్ చల్ చేస్తుంది. కరీనాను కన్విన్స్ చేసి హిందువుగా మారుస్తామని బలవంతం ఏమీ ఉండని దుర్గా వాహిని నాయకురాళ్లు చెప్తున్నారు.
ముస్లింలను పెళ్లాడినా హిందువులుగా మారాలనుకునే వారికి సహాయం చేయడమే తమ ఉద్దేశమని వారంటున్నారు. బలవంతపు మత మార్పిడులు తమ విధానం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.