ఆదిలాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలోని బెజ్జూరు మండలంలో కృష్ణపల్లి, కుకుడ, కాగజ్‌నగర్‌లోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేమనపల్లి మండలంలో గొర్లపల్లి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో జిల్లాలోని 30 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ముంపు గ్రామాలకు రక్షణ చర్యలు చేపడుతున్నారు