By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: శ్రీనివాస్ రెడ్డితో మీడియా అకాడమీకీ గౌరవం పెరిగింది
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > శ్రీనివాస్ రెడ్డితో మీడియా అకాడమీకీ గౌరవం పెరిగింది
NewsTelangana

శ్రీనివాస్ రెడ్డితో మీడియా అకాడమీకీ గౌరవం పెరిగింది

Last updated: 2024/07/05
Published July 5, 2024 News Telangana
Share
SHARE
-దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకం ద్వారా ఆ సంస్థకు ఎంతో గౌరవం పెరిగిందని దేవరకొండ శాసన సభ్యులు బాలునాయక్ అన్నారు. నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లిలో స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీలతో కలిసి గురువారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉత్తమ పాత్రికేయులుగా, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీనివాస్ రెడ్డి అనుభవాలు ఓ చరిత్ర అని బాలునాయక్ కొనియాడారు. ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ముఖ్యమంత్రులతో తత్సంబంధాలు కలిగివున్నప్పటికీ శ్రీనివాస్ రెడ్డి ఏనాడూ ఆ గర్వాన్ని ప్రదర్శించలేదని, సౌమ్యులుగా సాదాసీదా జీవితాన్ని గడపడం స్ఫూర్తి దాయకమన్నారు. ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, వీలైనంత తొందరలో ఇండ్లు, ఇంటి స్థలాలను అందించేందుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బాలునాయక్ భరోసా ఇచ్చారు. అలాగే మల్లేపల్లిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం, నిధులను మంజూరీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారానికి సియం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సానుకూలంగా ఉన్నారని, వారి సూచన మేరకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం, అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన మీడియా వృత్తిని అప్రతిష్ట పాలుచేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, దాదాపు యాభై యేండ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల గొంతుకగా పోరాడుతున్న శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకం కావడం ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చినట్లు తాము భావిస్తున్నామన్నారు. అనునిత్యం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఆయన సారథ్యంలో జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడిందని విరాహత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లేపల్లి ఎంపిపి అధ్యక్షురాలు రేఖ శ్రీధర్ రెడ్డి, యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:devarakonda mla balu naikhousing for journalistsjournalists' welfarejournalists' welfare societymedia accreditationmedia integritynalgonda districtponguleti srinivas reddypress clubRevanth ReddySrinivas Reddytelangana media academytuwjvirahat ali
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article తుడా చైర్మన్ గా శ్రీమతి చైతన్య
Next Article అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?