కరీంనగర్ రాజా థియేటర్ సమీపంలోని అమీన్ భాయ్ బైక్ పాయింట్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. పెద్దపెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పురమళ్ళ శ్రీనివాస్ ల చేతుల మీదుగా గురువారం నాడు అమీన్ బాయ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . దాదాపు 350 మందికి అన్నదానం చేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు అమీన్ బాయ్ . రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎక్కువమందికి అన్నదానం చేసినట్లు అమీన్ బాయ్ తెలిపారు .