By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: అభివృద్ధి ఎజండగా పనిచేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Government & Development > అభివృద్ధి ఎజండగా పనిచేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Government & DevelopmentInvestment & DevelopmentLeadershipNewsTelangana

అభివృద్ధి ఎజండగా పనిచేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Last updated: 2026/06/09
Published June 9, 2026 Government & Development Investment & Development Leadership News Telangana
Share
SHARE

 రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. దేశంలోని మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనంలోకి తీసుకుని శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామని అన్నారు.

 ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. మల్కాజిగిరి పరిధిలోని గాజుల రామారంలో వంద ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

 హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.

రాయదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మెట్రోను విస్తరణ పనులు చేపడుతామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా చెప్పుకుంటే సరిపోదని, అందుకు అనుగుణంగా ప్రణాళికలతో అభివృద్ధి జరగాలని చెప్పారు. సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొషన్ భవనాలను ఆధునిక సదుపాయాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పేదలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారని గుర్తుచేస్తూ నగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను కట్టించి కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్న వారికి అదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని, అందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని తెలిపారు.

దేశంలోని ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, బెంగుళూరు, చెన్నై మహానగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయని వివరించారు. ఈ అయిదు నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఏమవసరమో గుర్తించి స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నామని చెప్పారు.

“ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం 1.34 కోట్ల జనాభా ఉండగా, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ మహానగరంలో ప్రతి ఏటా 3 శాతం శరవేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం ఈ ప్రాంతమంతా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్.. ఇలా 4 రకాల పరిపాలన సాగింది.

శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా తాగునీరు, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త పేరుకుపోవడం, కరెంట్, పోలీసు వంటి అనేక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే నిపుణులతో సమాలోచనలు చేసి 2100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విడదీయాలని నిర్ణయించాం.

150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా వికేంద్రీకరించాం. వీటికి అనుగుణంగానే పోలీస్ కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేశాం.

మహానగరం అభివృద్ధి చెందాలని ఈ వికేంద్రీకరణ జరిగింది. అభివృద్ధి విషయంలో రాజకీయ వివక్ష, వితండవాదం లేదు. అభివృద్ధి జరగాలి. ఎన్నికల సమయంలో రాజకీయాలు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. అప్పటివరకు అన్ని పక్షాలు విజ్ఞతతో అభివృద్ధికి సహకరించాలి..” అని ముఖ్యమంత్రి గారు కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, మండలి ఛీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, ఎమ్మల్యేలు అరికెపూడి గాంధీ గారు, మల్‌రెడ్డి రంగారెడ్డి గారు, నవీన్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టుల సమస్యను పరిష్కరించండి
Next Article “ఇడుపు కాయితం ” సినిమా ప్రారంభం
- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?