(పొలిటికల్ ఫ్యాక్టరీ – గోదావరిఖని )
ప్రముఖ వ్యాపారవేత్త , మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని గోదావరిఖని కి చెందిన పలువురు న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పెద్దపెల్లి లోక్ సభ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్ గురువారం నాడు పలువురు న్యాయవాదులను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు . ఇందుకు సానుకూలంగా స్పందించిన పలువురు న్యాయవాదులు ఆసంపల్లి శ్రీనివాస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానికుడు ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని , ఆయన గెలుపు కోసం న్యాయవాదుల అందరం కృషి చేస్తామని తెలిపారు. గోదావరిఖనిలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయవాది ఆసంపల్లి రవి నేతృత్వంలో పలువురు న్యాయవాదులను ఆసంపల్లి శ్రీనివాస్ కలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు , కేంద్ర కమిటీ సభ్యులు శ్రీమతి శైలజ, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గోశిక ప్రకాష్, మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీలత, మాదిగ లాయర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి పెరుక మనోహర్ ,నేతకాని లాయర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ట్రెజరర్ ఎండి ఉమర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరుగురాల సంతోష్ ,మార్కాపూర్ తిలక్, పల్లవి , రజిత ,శోభ ,ప్రవల్లిక , భాగ్య ,రమ్య , శ్రీకాంత్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు . తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన న్యాయవాదులకు పెద్ద పెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.