-TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
వివిధ కేటగిరిలా మాదిరిగానే, ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులు కూడా మీడియా అక్రెడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేలా వెబ్ సైట్ లో అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ సూచించారు.
ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు నండూరి హరీష్ తో కలిసి, రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు జగన్ దృష్టికి ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టుల సమస్యను ఆయన తీసుకెళ్లారు. దీనిపై జగన్ స్పందిస్తూ, ఒకటి రెండు రోజుల్లో వెబ్ సైట్ లో ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ పొందుపర్చుతామని, వీడియో క్లిప్పులను పెన్ డ్రైవ్ ద్వారా తమకు అందిస్తే సరిపోతుందని సూచించారు.