ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. వారందరికీ ప్రత్యేక క్రుతజ్ఝతలు.
ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలవల్లే ఈరోజు నాకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం వినియోగిస్తా.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేదొక్కటే. ఎన్నికలప్పుడే రాజకీయాలు… వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివ్రుద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివ్రుద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నా.
అట్లాగే తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తా.