(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసులో నిందితుడుగా ఉన్న కల్వకుంట్ల కన్నారావును, ఆదిభట్ల పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బాలాపూర్ సమీపంలో అరెస్టు చేశారు.
తుర్కయాంజల్, మన్నెగూడలో ఓ భూకబ్జా కేసులో మూడు కోట్లకు డీల్ కుదుర్చుకొని, 2.35 కోట్ల రూపాయలు తీసుకొని భూ సెటిల్మెంట్ వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.. మార్చి 3 తేదీన కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఏ3 గా ఉన్న కన్నారావు తప్పించుకు తిరుగుతున్నాడు. భూకబ్జా కేసు కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కన్నారావు పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో, కన్నారావు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా కేరళ, బెంగళూరు, మాల్దీవులు తిరుగుతూ, 7 సెల్ ఫోన్లు వాడుతూ తప్పించుకు తిరిగాడని సమాచారం..
మరో మారు బెయిల్ పిటిషన్ ప్రయత్నంలో హైదరాబాద్ కు వచ్చాడు. బొల్లారంలో అడ్వకేట్ ను కలుసుకోవడానికి సిద్దిపేట నుండి బొల్లారం వస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో కన్నారావు, అడ్వకేట్ కలుసుకునే స్థావరాన్ని మార్చుకున్నారు.
బాలాపూర్ సమీపంలో కలుసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ సమీపంలో రెండు బృందాలుగా గస్తీ కాసి ఉన్న పోలీసులు కన్నారావును ఈ రోజు అరెస్టు చేశారు..