By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: ఎంఎస్ఎంఈ లకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > News > ఎంఎస్ఎంఈ లకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ
NewsPolitical NewsTelangana

ఎంఎస్ఎంఈ లకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ

Last updated: 2024/09/20
Published September 20, 2024 News Political News Telangana
Share
SHARE
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం ఆ పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠికి ఊతమిచ్చేలా ఉందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. పారిశ్రామికరంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరిశ్రమల శాఖ ద్వారా నూతన పాలసీని రూపొందించడం, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ముదావహమని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన పాలసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బలోపేతమవు తుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకాలం సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలు ఈ పాలసీతో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగు తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పారిశ్రామికవాడల్లో ఎంఎస్‌ఎంఈలకు స్థలాలను కేటాయిస్తే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆయా స్థలాలను గవర్నమెంట్ నుంచి కొనాల్సి వచ్చేదని, ఫలితంగా పెట్టుబడి మొత్తంలో ఎక్కువ డబ్బు స్థలం కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వచ్చేదని, దీంతో పరిశ్రమ ఏర్పాటుకు మరింత అప్పులు చేయాల్సి రావడం వారికి భారంగా మారేదని, అయితే ఇప్పుడు నూతన పాలసీతో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారు స్థలాన్ని కొనాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు. ఏకంగా 33 ఏళ్ల వరకు లీజుకు తీసుకునే వెసులుబాటును ఈ పాలసీ కల్పిస్తుందని, దీంతో పారిశ్రామికవేత్తలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్థాపించ బోయే పరిశ్రమల కోసం పక్కా భవనాలు కూడా లీజు పద్ధతి లో ఇస్తారని, ఈ భవనాలను కూడా పరిశ్రమలకు అనువు గా ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తారని ఆయన వివరించారు. నిర్ణీత గడువులోగా పరిశ్రమను స్థాపించకుంటే లీజుకిచ్చిన భూమిని, భవనాలను వెనక్కి తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ నూతన విధానం తో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

TAGGED:33-Year LeaseDr. Kavvampalli Satyanarayanaduddilla sridhar babuEconomic BoostFinancial Support for MSMEsGovernment-Private PartnershipIndustrial EntrepreneursIndustrial ParksIndustrial ProgressIndustrial Sector GrowthLand Lease PolicyLease Buildings for IndustriesManakondur MLAMedium Scale IndustriesMicro IndustriesMSME Land AllocationMSME Policy TelanganaNew MSME Policypolitical factoryRevanth ReddySmall Scale IndustriesTelangana EconomyTelangana Government PolicyTelangana Industrial DevelopmentTelangana State
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article కరీంనగర్ ఐటీఐలో ఏఆర్ వీఆర్ ల్యాబ్ ప్రారంభం
Next Article Pailam Pilaga Movie Press Note
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?