(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి రఘు అధిక మార్కులు సాధించిన విద్యార్థులను , పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరాలని జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు . అలాగే పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు కృంగిపోకుండా మళ్లీ వచ్చే సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత కావాలని దానికి అనుగుణంగా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలకు 72 మంది హాజరవగా 69 మంది పాసయ్యారని, జి. చరణ్ 600కు 561 మార్కులు సాధించడం పాఠశాలకు గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్లు పంజాల జ్యోతి, కంకల భాగ్యలక్ష్మి, మొలుగూరి మొగిలయ్య, భారతమ్మ,ఎండి రహీం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకునూరి రవి, శనిగరం జైపాల్, సాయి, సాత్విక్,బిజెపి నాయకుడు కొన్ని ప్రవీణ్, మరియు గ్రామ యువకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు