తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సి.వి. ఆనంద్‌ను ఆ పదవి నుంచి బదిలీ చేస్తూ, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్‌గా బాధ్యతలు అప్పగించింది. యూపీఎస్సీ ఎంపానెల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిరక్షణ, ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నారు.