పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మార్నింగ్ వాక్ పాల్గొన్నారు అనంతరం సుల్తానాబాద్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు
ఈ ప్రచారం లో కొప్పుల ఈశ్వర్ ప్రజలకు రానున్న పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా వస్తున్నా అని, కారు గుర్తుకు ఓటు వేయాలని, వాటర్స్ కి విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ…
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి గౌరవ కెసిఆర్ గారు అవకాశం కల్పించారు.. ఈ సందర్భంగా మీ సహాకారం, అందరి మద్దతు మీ అందరి ఆశీర్వాదం కావాలని కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు..
నేను ఈ ప్రాంతానికి చెందిన వాన్ని, సొంత గ్రామం కుమ్మరికుంట, జూలపల్లి మండలం గోదావరిఖని లో పుట్టి పెరిగి, కుటుంబం మొత్తం సింగరేణి కుటుంబం, నేను చేస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మూలంగా ఎమ్మెల్యే గా అవకాశం వస్తే ఎమ్మెల్యే గా చాలా సంవత్సరాలు ఉన్నాను..
తెలంగాణ ఉద్యమం లో మళ్లీ అవకాశం వచ్చింది, అనుభవం ఉన్న వ్యక్తిగా, ఈ ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తిగా కార్మిక, రైతాంగ, ఇతర వర్గాల సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందని కెసిఆర్ గారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారు…
ఇప్పటి వరకు ఎంపి గా గెలిచిన వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే…
మొదటి సారి గా 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఈ ప్రాంత వ్యక్తి గా అవకాశం కల్పించినట్లైతే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కావచ్చు, సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఇక్కడ గెలిచిన వారు చుట్టపు చూపుగా వచ్చిపోయే సంప్రదాయాన్ని చూస్తున్నాము, కాని స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజల అందుబాటులో ఉన్న తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు..
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు