టిఆర్ఎస్ నుంచి బయటకు వస్తే బిజెపిలో చేర్చుకుంటాం..
టిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు
బండి సంజయ్ సంచలన కామెంట్స్
(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
టిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు
బండి సంజయ్ సంచలన కామెంట్స్
(పొలిటికల్ ఫ్యాక్టరీ – హైదరాబాద్ )
మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఆయనను బిజెపిలో చేర్చుకుంటామని కరీంనగర్ ఎంపీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సంచలన కామెంట్ చేశారు. హైదరాబాదులోని స్టేట్ పార్టీ ఆఫీసులో శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ తో తమ పార్టీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారం కోస్తే కెసిఆర్ కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని ఆరోపించారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఉందని, బిఆర్ఎస్ స్కాములు బయటపడుతున్న కాంగ్రెస్ సర్కారు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ సీట్లు దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీ నుంచి షిండేళ్లు బయటకు వస్తారని పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి బస్సు యాత్ర మొదలు కానుందని, 25వ డేట్ నుంచి ప్రజాహిత యాత్ర రెండో విడత ప్రారంభం కానుందని తెలిపారు.