కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకోవడంపట్ల మోదీ సంతోషం
అట్టడుగు వర్గాలకు కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా క్రుషి చేయాలని సూచన
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా వీరి మధ్య ప్రస్తావనకు రాగా ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర నిధులు, అభివ్రుద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లామని విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ మోదీ ద్రుష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్ధులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన అంశాన్ని ప్రస్తావించారు. నూతనంగా గెలిచిన కరీంనగర్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల పక్షాన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘‘ప్రజలకు నిరంతరం సేవ చేయడంలోనే త్రుప్తి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు క్రుషి చేయండి. అట్టడుగు వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్విరామంగా పనిచేయండి’’అని సూచించారు.