(పొలిటికల్ ఫ్యాక్టరీ – విజయవాడ)
జనవరి 19 : యోగివేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నగరం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు .
సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ , కె.జి.వి.సరిత , సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.*
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యోగివేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని అని అన్నారు .
ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని ఆయన తెలిపారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు.
యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.*