(పొలిటికల్ ఫ్యాక్టరీ – విజయవాడ )
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.
మాచర్లలో ఆయన మీడి యాతో మాట్లాడుతూ అసలు జనసేన ఎవరితో పొత్తు లో ఉంది బీజేపీ తోనా, టీడీపీతోనా? అని నిలదీశారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నరస రావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయిం చారని.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవ రాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండి పడ్డారు..
బీసీలకు సీటు ఇస్తే తట్టు కోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు, ఒక బీసీ ద్రోహిగా ఫైర్ అయ్యారు.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసు కొని ముందుకు వెళ్తామని తెలిపారు.
ఇక, ఏపీ రాజధానిపై మాట్లాడుతూ, ..ప్రస్తు తానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు..ఎపికి అసలు రాజధాని లేదంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన ధీటుగా సమాదానం ఇచ్చారు.
అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, అది ఎపికి రాజదానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు.. రాజ దానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.