By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: భావోద్వేగాలతో సుహస్ మూవీ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రివ్యూ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Movie Reviews > భావోద్వేగాలతో సుహస్ మూవీ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రివ్యూ
Movie Reviews

భావోద్వేగాలతో సుహస్ మూవీ.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రివ్యూ

Last updated: 2024/02/05
Published February 5, 2024 Movie Reviews
Share
SHARE

కథ:

అంబాజీపేట అనే ఊర్లో వెంకట్ (నితిన్ ప్రసన్న) పెద్ద మనిషిగా చెలామణి అవుతుంటాడు. ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే గ్రామంలో మల్లి (సుహాస్) మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్‌గా పని చేస్తుంటుంది. వెంకట్ వల్లే పద్మకి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. దాంతో, పద్మ తనకు ఇష్టం లేకపోయినా ప్రతి ఆదివారం వెంకట్ దగ్గరకు వెళ్లి అతని వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు రాస్తుంటుంది. మరోవైపు, వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ)తో ‘మల్లి’ ప్రేమలో పడతాడు. శివాని కూడా మల్లిని ప్రేమిస్తోంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయిన వెంకట్ కి.. మల్లి, మరియు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ గ్రూప్ ఎలా బుద్ధి చెప్పింది ?, చివరకు మల్లి ప్రేమ కథ ఎలా సాగింది ? అన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల మనోభావాలను ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక కథతో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఏ తప్పు చెయ్యని వారిని కులం పేరుతో అగ్ర కుల సమాజం మానసికంగా హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

అలాగే, ఆత్మాభిమానంతో ఉండే పద్మ – మల్లి పాత్రలకు – వెంకట్ పాత్రకు మధ్య మొదలైన వైరం.. ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ కథ కొత్త మలుపు తీసుకోవడం, చివరకు వెంకట్ పరిస్థితి ఊహించని విధంగా మారిపోవడం.. ఇలా కథలో దర్శకుడు దుష్యంత్ కటికినేని మంచి ఎలిమెంట్స్ రాసుకుని అంతే సమర్ధవంతంగా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు. సుహాస్ నటన అద్భుతంగా అనిపిస్తోంది. మరో కీలక పాత్రలో శరణ్య ప్రదీప్ కూడా చాలా బాగా నటించింది. నితిన్ ప్రసన్న పాత్ర మాత్రం ఈ సినిమాకి ప్రత్యేకం. హీరోయిన్ గా శివాని నాగరం బాగా అలరించింది. అలాగే, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు దర్శకుడు దుష్యంత్ పనితీరు సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది.
మైనస్ పాయింట్స్ :
మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిజానికి ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన ఎలిమెంట్స్ కూడా ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు.
సాంకేతిక విభాగం :
మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, దుశ్యంత్‌ కటికినేని రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత ధీరజ్ మోగిలినేనిను అభినందించాలి. ఆయన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
Politicalfactory.com Rating: 3/5

You Might Also Like

తెలంగాణ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం! శభాష్ రేవంత్ రెడ్డి , దిల్ రాజు

సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన

టీచర్ల బదిలీలకు దరఖాస్తు చేసుకునే మరో అవకాశం

టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఐదు సంతకాలతో అన్ని వర్గాలకు భద్రత

TAGGED:actorambajipetabanddramaemotionmarriagemoviepoliticalfactoryreviewsuhaas
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article 11మంది ఐ పి ఎస్ అధికారులకు పదోన్నతి: ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
Next Article ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ బురిడీ.. ఢిల్లీ సైబర్‌ కి‘లేడీ’ అరెస్ట్‌..
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?