By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: వైవిధ్యంగా విశ్వక్‌ సేన్‌ ‘గామి’ .. కథాకథనం కోసం దర్శకుడి ఆరాటం
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Movie Reviews > వైవిధ్యంగా విశ్వక్‌ సేన్‌ ‘గామి’ .. కథాకథనం కోసం దర్శకుడి ఆరాటం
Movie ReviewsNews

వైవిధ్యంగా విశ్వక్‌ సేన్‌ ‘గామి’ .. కథాకథనం కోసం దర్శకుడి ఆరాటం

Last updated: 2024/03/09
Published March 9, 2024 Movie Reviews News
Share
SHARE
విశ్వక్‌ సేన్‌ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్‌, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రచారాలు కూడా విరివిగా చేశారు, ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా కూడా వున్నాయి. ఈ సినిమా పూర్తి చేయడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. ఈ సినిమాతో విద్యాధర కాగిత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసమని ఎక్కడో హిమాలయాల్లో మంచు బాగా కురిసే ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడం, కొన్నిసార్లు ప్రత్యేకమైన ఋతువులకోసం ఎదురుచూడటం వంటివి చేయడంతో సినిమా పూర్తి చేయడానికి చాలా కాలం పట్టిందని చెబుతున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చింది. శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఒక అఘోర, అతనికి మానవ స్పర్శ, అంటే ఇంకొక మానవుడిని ఎవర్ని ముట్టుకున్నా అతనికి అదొక రకమైన వ్యాధి వచ్చి చనిపోతాడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉండే ఒక మొక్కలో ఆ ఔషధం ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్‌ వ్యాధి నయమవుతుందని స్వావిూజీ చెప్తాడు. ఈ మొక్క కూడా 35 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని.. ఆ సమయంలోనే ఆ మొక్కని తీసుకురావాలని చెప్తాడు. జాహ్నవి (చాందిని చౌదరి) ఒక డాక్టర్‌, రీసర్చ్‌ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకు దేవదాసి నుండి తప్పించేస్తారు, కుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల విూద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు, అక్కడి నుండి ఒక అబ్బాయి తప్పించుకొని బయటపడతాడు. ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. శంకర్‌కు ఆ ఔషధం తీసుకురావడంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి సాధించాడా? జాహ్నవి ఏమైంది? దేవదాసి కుమార్తె తప్పించుకొని ఎక్కడికి వెళ్లింది? బయటపడిన కుర్రాడు ఏమయ్యాడు? ఇవన్నీ ‘గామి’ సినిమాలో తెరకెక్కించారు. తెలుగు సినిమాలో ఒక వైవిధ్యమైన కథ చెప్పాలని, సినిమా అంటే వ్యాపార విలువలే కాకుండా ఒక మంచి కథ కూడా చెప్పాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసారు.
ఇక తెరవిూద ఒక్కో సన్నివేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైన ఆ మంచు ప్రదేశాలు, ఆ కొండలు, ఆ పర్వతాలు, ఔషధం కోసం శంకర్‌ పడే పాట్లు, సాహసాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు చాలా తెలివిగా కథనాన్ని అల్లుకున్నాడు. శంకర్‌కి ఎందుకు మానవ స్పర్శ తగలకూడదు.. తగిలితే ఏమవుతుంది అనే విషయాన్ని దర్శకుడు చివరివరకు ఆసక్తిగా కొనసాగించాడు. మరోవైపు గ్రామాల్లో జరిగే దేవదాసి సంప్రదాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు. అలాగే మనుషుల విూద ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు వాళ్ళ మధ్యలో కొంతమంది మనుషులు ఏ విధంగా నరకయాతన పడుతున్నారనేది చాలా బాగా చూపించాడు. ఈ సినిమాలో మాటలు తక్కువగానే ఉన్నప్పటికీ.. అవే చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి.ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉందంటే అందుకు చాయాగ్రహణం చాలా ముఖ్యం చాలా బాగా చూపించారు. దానికి తోడు నేపథ్య సంగీతం బాగా తోడై సినిమా ఇంకో లెవెల్‌కి వెళ్లడానికి ఉపయోగ పడిరది. వీటన్నింటిని జనరంజకంగా మలిచినందుకు దర్శకుడిని అభినందించాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్‌ శంకర్‌గా మంచి నటనను ప్రదర్శించాడీ సినిమాలో. శంకర్‌ పాత్రలో మమేకం అయిపోయాడు. సినిమాలో మనకి నటులు గుర్తుకురారు పాత్రలే గుర్తుంటాయి. హీరోయిన్‌ చాందిని చౌదరి చాలా చక్కగా నటించింది.
తెలుగమ్మాయిలు మంచి పాత్రలు వస్తే ప్రతిభ చూపిస్తారని చాందిని.. జాహ్నవి పాత్రలో నిరూపించింది. అభినయ దుర్గగా, ఉమగా వేసిన అమ్మాయి చాలా బాగా చేశారు. శంకర్‌ అనే ఒక అఘోర తనెవరో.. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవాలని చేసే ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనల ఆధారంగా మలచిన చిత్రం. ఆ లాబరేటరీ పరీక్షలవి ప్రేక్షకులకి అర్థం కాకపోవచ్చు. వాటిని పక్కన పెడితే.. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

TAGGED:actresschandinichowdarydirectorgaamimoviepoliticalfactoryreviewvishwaksen
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article విడాకుల వార్తలకు నయన్‌ చెక్‌
Next Article ‘గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి’ పోస్టర్‌ విడుదల
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?