By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
    October 2, 2026
    జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
    October 2, 2026
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
    September 29, 2026
    వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    September 26, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: థ్రిల్లర్స్ ఇష్టపడేవారు “సత్యభామ” మూవీని ఎంజాయ్ చేస్తారు – మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Film News > థ్రిల్లర్స్ ఇష్టపడేవారు “సత్యభామ” మూవీని ఎంజాయ్ చేస్తారు – మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల
Film NewsNews

థ్రిల్లర్స్ ఇష్టపడేవారు “సత్యభామ” మూవీని ఎంజాయ్ చేస్తారు – మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల

Last updated: 2024/06/03
Published June 3, 2024 Film News News
Share
SHARE
క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమాకు మ్యూజిక్ అందించిన ఎక్సీపిరియన్స్ తెలిపారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.
– కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తుండటం “సత్యభామ” మూవీ మీద నాకు ఎగ్జైట్ మెంట్ పెంచింది. అలాగే శశికిరణ్ తో నేను చేస్తున్న మూడో చిత్రమిది. డైరెక్టర్ సుమన్ కూడా బాగా పరిచయం. స్నేహితులతో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఎగ్జైట్ గానే పనిచేస్తాం. మిగతా వారితో వర్క్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఉండదని కాదు. పదేళ్లుగా కలిసున్న ఫ్రెండ్స్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. కాజల్ కు పర్పెక్ట్ కమ్ బ్యాక్ మూవీ ఇదని అనుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
– థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి “సత్యభామ” బాగా నచ్చుతుంది. ఇందులోని ట్విస్ట్ లు టర్న్ లు సూపర్బ్ గా ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎమోషనల్ జర్నీ ఇది. “సత్యభామ”లోని యాక్షన్ సీక్వెన్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాజల్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తనే సొంతంగా చేసేంది. బిడ్డ పుట్టిన తర్వాత తను ఇంత భారీ యాక్షన్ సీక్వెన్సులు చేయడం అంత ఈజీ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్సులు చూసి నేను ఇన్స్ పైర్ అయ్యి మ్యూజిక్ చేశాను.
– “సత్యభామ”లో మొత్తం ఐదు పాటలుంటాయి. ముందు రెండు సాంగ్స్ అనుకుని స్టార్ట్ చేశాం. కళ్లారా చూసాలే అనేది కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్, వెతుకు వెతుకు కీరవాణి గారు పాడారు. ఇది కాజల్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాం. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలో రిలీజ్ చేస్తాం. ఈ పాటలన్నీ సినిమాలో ఉంటాయి.
– ఈ సినిమాలో వెతుకు వెతుకు పాటకు కీరవాణి గారు, చంద్రబోస్ గారితో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేని విషయం. గతంలో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకు నా మ్యూజిక్ లో కీరవాణి గారు పాడారు. “సత్యభామ” పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే నా పాట ఏది విన్నావ్, ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్ అని అడిగారు. చంద్రబోస్ గారు కూడా ట్యూన్ మీటర్ కు పాట ఇచ్చి వెళ్లిపోకుండా డిస్కస్ చేస్తూ పాట బాగా వచ్చేవరకు మాతోనే ఉన్నారు. వాళ్లు అంత సీనియర్స్ అయి ఉండి కూడా వర్క్ మీద చూపించే శ్రద్ధ కొత్తవాళ్లు నేర్చుకోవాలి.
– థ్రిల్లర్ మూవీస్ కు ఎక్కువ వర్క్ చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. అయితే నేను మొత్తం థ్రిల్లర్ మూవీస్ చేయలేదు. కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్ వంటి లవ్, కమర్షియల్ చిత్రాలకూ సంగీతాన్ని అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకు పర్సనల్ గా మాస్, కమర్షయిల్ మూవీస్, లవ్ స్టోరీస్ చేయాలనే కోరిక ఉంటుది. గూఢచారి 2 తర్వాత థ్రిల్లర్ ఎన్ని చేస్తానో తెలియదు.
– థ్రిల్లర్ మూవీస్ లో సాధారణంగా బీజీఎంకు ఎక్కువ పేరొస్తుంది. అలాగని పాటలు బాగుండవని కాదు. పాటలు బాగున్నా ఆడియెన్స్ బీజీఎంకు ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాకు డిఫరెంట్ జానర్ మూవీస్ కు మ్యూజిక్ చేయాలని ఉంటుంది. మేజర్ లో హృదయమా పాట హిట్ అయ్యింది, డీజే టిల్లులో పటాస్ పిల్లా హిట్ అయ్యింది. నేను అన్ని రకాల మూవీస్ కు పాటలు చేయగలను. కానీ అలాంటి అవకాశాలు కూడా రావాలి కదా. నేను చిన్నప్పుడు గజల్స్ ఎక్కువగా వినేవాడిని. రాక్ మ్యూజిక్ చేశాను. నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయలేదు. క్షణం సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాకు నేను ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులకు నచ్చింది. అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను.
– ఇప్పుడు ఆడియెన్స్ చాలా క్లియర్ గా మూవీ చూస్తున్నారు. మ్యూజిక్ ఏంటని గుర్తుపడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి లేపేసి పెడితే కుదరదు. వారికి కొత్తగా మ్యూజిక్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ కోసం నిద్రలేకుండా కూడా పనిచేస్తా.
– నేను ఎవరితో పోటీ అనుకోను. నాకు నేనే పోటీగా భావిస్తా. నా తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో వివేక్ సాగర్, కాళభైరవ, ప్రవీణ్ లక్కరాజ్ వంటి అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇప్పటిదాకా నేను హాలీడే కు వెళ్లలేదు. మూవీ తర్వాత మూవీ వస్తూనే ఉంది. నాకు అదృష్టవశాత్తూ మంచి డైరెక్టర్స్ పరిచయం అయ్యారు. కృష్ణ అండ్ హిస్ లీలలో చిన్న క్యారెక్టర్ లో కనిపించాను. ఫ్రెండ్స్ మూవీస్ లో సరదాగా ఏదైనా క్యారెక్టర్ చేయమంటే చేస్తా. కానీ యాక్టింగ్ కెరీర్ గా తీసుకోవడానికి టైమ్ లేదు. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. గూఢచారి 2 తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.

You Might Also Like

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

TAGGED:actionaurum artsbobby thikkachandra bosegudhachari 2kajal aggarwalkalabhairavakeeravanikrishna and his leelamajormusic directornaveen chandrapraveen lakrajqueen of massessasikiran thikkasatyabhamasricharan pakalasrinivasa rao takkalapallisuman chikkalathrillervivek sagar
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న “భజే వాయు వేగం”
Next Article అమరావతి రైతుల త్యాగాలకు విశాఖ ప్రజల సంచలన తీర్పు
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి
News Political News Telangana
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
Media & Press News Political News Telangana
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్
News Political News Telangana
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
News Political News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?