ఓటీటీ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’చిత్రం ఇటీవలే FCC కాశీలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది క్రియేటర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి.మధు హై బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తమన్నా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. నాగ సాధువులా వేషం ధరించి.. ఒక దండము, మరో చేతిలో ఢమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో శివశక్తిగా అద్భుతం అనేలా తమన్నా దర్శనమిస్తోంది. కాశీ ఘాట్‌లపై నడుస్తూ, ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. తమన్నా విషయంలో ఇది అన్ బిలివబుల్ మేకోవర్ అనే చెప్పుకోవాలి. ఈ ఏజ్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కూడా ఇలా కనిపించింది లేదు. ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటూ.. శివరాత్రికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా ఉంది. ఓదెల 2 గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ముఖ్య తారాగణం. ఈ సినిమాలో టాప్ క్లాస్ ఉండబోతున్నాయని, ‘ఓదెల 2’ కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారని మేకర్స్ తెలుపుతున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమా నేషనల్ వైడ్‌గా విడుదల కానుందని మేకర్స్ తెలియజేశారు. కాగా.. సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.