బన్నీ వాస్, సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, కేఎల్ దామోదరప్రసాద్, ఎస్ కేఎన్, బాపినీడు, ధీరజ్ మొగిలినేని, దర్శకులు మెహర్ రమేష్, చందూ మొండేటి, సాయి రాజేశ్, వేణు ఊడుగుల, సాయి మార్తాండ్ అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.