సమ్మర్ ఆక్టింగ్ అండ్ డాన్స్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం లో అయిలు రమేష్!
(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
కరీంనగర్ లోని మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ వర్క్ షాప్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఈరోజు ఫిలిం భవన్ లో సర్టిఫికెట్లు అందజేశారు.నెలరోజుల పాటు చిన్నారులు నేర్చుకున్న నటన మరియు డాన్స్ ప్రదర్శన అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,దర్శకులు అయిలు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కరీంనగర్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ గా మారిందని, నటించాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు నటనలో మెళుకువలు నేర్చుకుని ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశాలు దొరుకుతాయన్నారు. పిల్లలకు నటనలో శిక్షణ ఇస్తూ టీవీ సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిలిం లో అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న మాస్క్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అనసూరి భూనాథ చారిని అతిథులందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు ఆర్ఎస్ నంద,వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్,నటులు వేణు పొల్సాని, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ రంగు భాస్కరాచారి, మతీన్, చైతన్య కళాభారతి అధ్యక్షులు తిప్పర్తి ప్రభు,సధాశ్రీ, బ్లూ మెన్ డాన్స్ అకాడమీ శ్రీరామోజు రామకృష్ణ, డిస్క్ డాన్స్ అకాడమీ తూమోజు శ్రీనివాస్, పలువురు కళాకారులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.