By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: గజిబిజి గందరగోళంగా ‘ఈగల్‌’
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Film News > గజిబిజి గందరగోళంగా ‘ఈగల్‌’
Film NewsNews

గజిబిజి గందరగోళంగా ‘ఈగల్‌’

Last updated: 2024/02/10
Published February 10, 2024 Film News News
Share
SHARE
రవితేజ కథానాయకుడిగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడిగా ‘ఈగల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా కూడా పెద్ద బడ్జెట్‌ మూవీ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ ఒక ముఖ్యపాత్రలో కనిపించగా, కావ్య థాపర్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఢిల్లీలోని ఒక జాతీయ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్‌) అనుకోకుండా ఒక చేనేత వస్త్రాన్ని చూస్తుంది, ఆసక్తిగా అది ఎక్కడనుండి వచ్చింది, అది తయారు చేసే వ్యక్తి గురించి ఆరా తీసి ఒక చిన్న వార్తగా పత్రికలో రాస్తుంది. ఆ వార్త చూసిన ఇంటిలిజెన్స్‌, రా డిపార్టుమెంట్స్‌ రంగంలోకి దిగి ఆ పేపర్‌ ఒకరోజు ప్రింట్‌ అవకుండా అడ్డుకొని, ఆ వార్త ఎలా వచ్చింది, ఎవరు రాసారు అని ఆరా తీస్తారు. పత్రిక యాజమాన్యం ఆ వార్త రాసిన నళినిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. అప్పుడు నళినికి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగి మదనపల్లి వచ్చి అక్కడ తన పరిశోధన ప్రారంభిస్తుంది. అక్కడ వున్న పోలీసు అధికారి చెంగల్‌ రెడ్డి (మిర్చి కిరణ్‌), ఎంఎల్‌ఏ (అజయ్‌ ఘోష్‌) అతని పిఏ (శ్రీనివాస్‌ రెడ్డి) వీళ్లందరినీ అడిగితే అతని పేరు సహదేవ్‌ వర్మ (రవితేజ) అని తెలుస్తుంది. అతను అక్కడ పత్తిని పండించి చేనేత కార్మికులకు అండగా వున్నాడు అని తెలుస్తోంది. అతని గురించి చాలా లోతుగా పరిశోధన మొదలుపెట్టిన నళినికి సహదేవ్‌ వర్మ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. భారతదేశంతో పాటు విదేశీ ప్రభుత్వాలు కూడా ఈ సహదేవ్‌ వర్మ గురించి వెదుకుతున్నారని, ఎక్కడో యూరప్‌లో మారణాయుధాలు ‘ఈగల్‌’ పేరుపై దొంగతనంగా సప్లై చేసే అతను.. ఇక్కడ సహదేవ్‌ వర్మగా ఎందుకున్నాడు? అతని భార్య రచన (కావ్య థాపర్‌)కి ఏమైంది? అన్నదే కథ. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తీసిన ఈ ‘ఈగల్‌’ కూడా ‘కెజిఎఫ్‌’ కోవలోకి వస్తుంది. అనుపమ పరమేశ్వరన్‌ కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. అక్కడనుండి ఆమె పరిశోధనకు మదనప్లలె వస్తుంది, ఇక అక్కడనుండి రవితేజ పాత్ర కోసం బిల్డప్‌ మొదలవుతుంది. కథ ఏమీ లేకుండా వూరికే అందరూ రవితేజ పాత్ర కోసం బిల్డప్‌ ఇచ్చుకుంటూ వెళతారు. సినిమా మొదలైన 45 నిముషాల వరకు రవి తేజ పాత్ర అసలు తెరవిూదకి రాదు. టూకీగా చెప్పాలంటే మారణాయుధాలని దొంగ రవాణా చేసి యూరప్‌ దేశాల్లో ‘ఈగల్‌’ గా పేరొంది తుపాకీ అద్భుతంగా పేల్చగల వ్యక్తి.. అదే మారణాయుధాలని అక్కడ దొంగ రవాణా అవుతున్నా పట్టుకొని తనదగ్గర ఉంచుకుంటాడు, ఎందుకు? దాని వెనకాల వుండే నేపధ్యం ఏమిటి అనేది కథ. వినటానికి చాలా బాగుంది, ఇది బాగా చెప్పొచ్చు కూడా. కానీ దర్శకుడు ఈ కథనే చిలవలు పలవలుగా చేసి, అటు ఇటు తిప్పి, ఎంతసేపూ ఒక్కో సన్నివేశం విూదే దృష్టి పెట్టాడు కానీ, కథ, కథనం విూద సరిగ్గా దృష్టి పెట్టలేదు. రెండో సగంలో రవితేజ, కావ్య థాపర్‌ మధ్య నడిచే సన్నివేశాలు కథానాయకుడికి తుపాకీ పేల్చడంలో ఎంత ప్రవేశం వుందో చెప్పటం కోసం అన్నట్టుగా తుపాకీతో సమాధానాలు చెప్పించాడు. అలాగే సహదేవ్‌ వర్మ వుండే ఇంటి దగ్గర ఏమి జరిగింది అనేది చిన్న పిల్లాడితో ప్లాష్‌ బ్యాక్‌ చెప్పించాడు, అతను గ్రనేడ్స్‌, గన్స్‌, పోలీసులు, మిలిటరీ వీటన్నిటి గురించి చెప్పేస్తూ ఉంటాడు. ఇలాంటివి విచిత్రాలు చాలా వున్నాయి సినిమాలో. రా చీఫ్‌ మధుబాల, డిఫెన్స్‌ మినిస్టర్‌, మిగతా ఇంటిలిజెన్స్‌ సభ్యులు అందరూ ఢిల్లీలో ఒక గదిలో మదనపల్లిలో జరిగే విధ్వంసాన్ని సీసీ కెమెరాల్లో చూస్తూ ఉలిక్కిపడుతూ వుంటారు. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ నవ్వు తెప్పిస్తాయి. అనుపమ మదనపల్లిలో ఉంటుంది, ఏదో తెలుసుకోవాలంటే అజయ్‌ (నవదీప్‌)ని అడగాలి అంటారు, వెంటనే పోలాండ్‌ రాజధాని వార్సాలో నవదీప్‌ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. దర్శకుడు కథని వెనక్కి, ప్రస్తుతానికి.. మళ్ళీ వెనక్కి ఇలా సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. కథను నేరుగా వెండితెర పైన అర్థం అయేటట్టు చూపిస్తే బాగుందేమో అనిపిస్తుంది.దర్శకుడు సరైన విధంగా చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అనిపిస్తుంది.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:actiondirectoreagleentertainerkarthikkavyanavadeepravitejareddysrinivas
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article అయోధ్య రాముడి సేవలో బిగ్‌ బి
Next Article విజయ్‌ దేవరకొండతో బోయపాటి శ్రీను చిత్రం
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?