By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Political FactoryPolitical FactoryPolitical Factory
  • Home
  • Political News
    Political News
    Politics is the art of looking for trouble, finding it everywhere, diagnosing it incorrectly and applying the wrong remedies.
    Show More
    Top News
    ప‌ద్మ శ్రీ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌తి నెల రూ.25 వేల పెన్షన్: సీఎం రేవంత్ రెడ్డి
    February 5, 2024
    కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్
    February 6, 2024
    పెద్దపల్లి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్!
    February 7, 2024
    Latest News
    సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
    July 11, 2026
    రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    July 1, 2026
    నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
    July 1, 2026
    సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
    June 25, 2026
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Reading: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఓకే.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఎపి హైకోర్టు!
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Political FactoryPolitical Factory
  • Home
  • Categories
    • Political News
    • Telangana
    • Andhra Pradesh
    • Movie Reviews
    • Crime
    • Film News
  • My Bookmarks
  • Rashi phalalu
Follow US
  • Advertise
© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Political Factory > Blog > Film News > ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఓకే.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఎపి హైకోర్టు!
Film NewsNews

‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఓకే.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఎపి హైకోర్టు!

Last updated: 2024/02/17
Published February 17, 2024 Film News News
Share
SHARE
‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్‌ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ఏపీలో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లపై రెవిన్యూ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించి అప్పటికప్పుడు ప్రదర్శన నిలుపుదల చేయించారు. ఈనెల 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టు గురువారం స్టే విధించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) సినిమా నిర్వహకులు.. సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్ని సక్రమంగానే ఉన్నాయని, సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చిచెప్పిం. ఆంధప్రదేశ్‌ రాజధాని నేపథ్యంలో ‘రాజధానిఫైల్స్’ చిత్రాన్ని భానుప్రకాశ్‌ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్‌ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ నటించారు. రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదలను నిలువరించాలంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్‌ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు. చిత్రంలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులను పోలి ఉన్నాయని పిటిషనర్‌ తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. . వైఎస్సార్‌సీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీని నిర్మించారని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మించారన్నారు. ఈ సినిమాలో కించపరిచేలా సన్నివేశాలు లేవని సినిమా నిర్మాతల తరఫున లాయర్‌ వాదించారు. ఇప్పటికే ఈ మూవీ పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా, తాము రివిజన్‌ కమిటీని ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించామని తెలిపారు. గతేడాది డిసెంబర్లో సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తే వైఎస్సార్‌సీపీ ఇప్పుడు పిటిషన్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపారు.

You Might Also Like

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !

రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది

డ్రగ్స్ కు దూరంగా ఉండండి :సీఎం రేవంత్ రెడ్డి

TAGGED:andhra pradeshfilesgreenhigh courtmoviepoliticalfactoryrajadhanireleasesignal
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Previous Article హరీష్ రావుకు బండి సంజయ్ ఆఫర్
Next Article పొలిటికల్ ఫ్యాక్టరీ అందిస్తున్న అసెంబ్లీ లైవ్
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image

Latest News

సుడా చైర్మన్ రేస్ లో అసంపల్లి శ్రీనివాస్ (వాసు) !
News Political News Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
News Political News Telangana
నిరంతరం సేవలందిస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్లందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
News Political News Telangana
వైద్యులు ఫార్మసిస్టుల సమన్వయమే రోగి ఆరోగ్యానికి బలమైన పునాది
News Telangana
Political Factory

Political Factory Media covers the latest news in politics, entertainment, Tollywood, business, and sports. We keep updating Telangana and Andhra Pradesh news on politicalfactory.com

  • Home
  • Political News
  • Telangana
  • Andhra Pradesh
  • Movie Reviews
  • Crime
  • Film News
  • My Bookmarks
  • Rashi phalalu

Find Us

© 2014-2024 Political Factory Ailu Media House Private Limited. Developed by Pixehub
Welcome Back!

Sign in to your account

Lost your password?