హైదరాబాద్, ప్రతినిధి : ‘టైగర్’ మూవీ టీజర్ రిలీజైంది.. సందీప్‌కిషన్, ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. వీ.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళనటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కాశీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వినోదానికి ఎంతో ప్రాధాన్యమిచ్చామని, అలాగే యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాల్లో సందీప్‌కిషన్ అద్భుతంగా నటించాడని ఆనంద్ తెలిపాడు. కాశీలోని గంగానది ఈ చిత్రం మెయిన్ థీమ్.. షూటింగ్ త్వరలో ముగియబోతోందని అని ఆయన వెల్లడించాడు. రారా కృష్ణయ్య, జోరు చిత్రాల తరువాత సందీప్‌కిషన్‌కి ఇది మరో మూవీ.