
*(పొలిటికల్ ఫ్యాక్టరీ – తిరుపతి )
*జనవరి 19 : శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఏప్రిల్ మాసం ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. భక్తులు జనవరి 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందినవారు జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాలి. జనవరి 22న కల్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్, 24న రూ.300 ప్రత్యేక దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు.