(పొలిటికల్ ఫ్యాక్టరీ – విజయవాడ )
గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు బెయిల్ ఈరోజు లభించింది.
శ్రీనివాస్‌కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది.గత ఐదేళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే.
గత ఐదేళ్ల కాలంలో సాక్షం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరుకాకపోవడం గమనార్హం. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది.
కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. వారానికి ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది.