(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్ )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలు పెద్దపల్లి పార్లమెంటు టిక్కెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా జరిగాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర అనాధ వృద్ధుల ఆశ్రమంలో ఆసంపల్లి శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్, దేవేందర్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.